హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ జైలులో ఘనంగా సంక్షేమ దినోత్సవం

NRML: నిర్మల్ ప్రత్యేక సబ్‌జైలులో గాంధీ జయంతి సందర్భంగా సంక్షేమ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధిక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఖైదీలు సమాజంలో భాగమేనని, సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని సూచించారు. గాంధీజీ ఆశయాలను పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సబ్‌జైలు పర్యవేక్షణ అధికారి సూర్య ప్రకాష్,తదితరులు పాల్గొన్నారు.