హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

కర్నూలులో ఎంపీ బస్తిపాటి నాగరాజును APUWJ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘వర్కింగ్ జర్నలిస్టుల కోర్కెల దినం’లో సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. మీడియా కమిషన్, జర్నలిస్టుల భద్రతా చట్టం, నూతన వేజ్‌బోర్డు, ప్రమాద బీమా, హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.