హైదరాబాద్: 28°C
తెలంగాణ

దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం

HYD: దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బస్ డిపో పక్కన సంతోషిమాత ఆలయం పూజారిపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశారు.  అనంతరం అమ్మవారి విగ్రహంపై కర్రలు విసిరారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై  చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.