హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామసభలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్చ

NZB: ధర్పల్లి, దమ్మన్నపేట గ్రామసభలో పారిశుధ్య నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. తడి, పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను వేర్వేరు బకెట్లలో వేయాలని గ్రామస్థులకు సూచించడంతో పాటు, ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ వసంత రమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ విన్నవించారు.