హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై SOT దాడి

MDCL: అన్నోజిగూడ సంస్కృతి టౌన్‌షిప్‌లో పేకాట స్థావరంపై SOT ఉప్పల్ జోన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు సెట్ల ప్లేయింగ్ కార్డులు, ఆరు స్మార్ట్ ఫోన్లు, రూ.89,980 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పోలీసులు, పట్టుబడిన ఆరుగురిని పోచారం పోలీసులకు అప్పగించారు.