హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూగర్భ జలాలను పరిరక్షించాలి'

ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ రాజేశ్వరి ఆధ్వర్యంలో వికసిత భారత్ గ్రామ సభ నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల రక్షణకు ప్రజలు ఇంకుడు గుంతలు, పంట కుంటలు నిర్మించుకోవాలని పంచాయతీ కార్యదర్శి సంతోష్ తెలిపారు. వీటిని నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఎంపీడీవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.