హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంకటాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

KMR: ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అయ్యల సాయిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజమాబాద్ సహకార సంఘం పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం 2481 రూపాయలు చెల్లిస్తుందని సూచించారు. సాధారణ రకానికి 2441 రూపాయలు చెల్లిస్తుందని చెప్పారు.