హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీజీ ఆశయాలను పాటించాలి: ఎమ్మెల్యే

BHPL: భూపాలపల్లి పట్టణంలో మహాత్మాగాంధీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలంతా ఆచరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు భట్టు కర్ణాకర్‌తో కలిసి సుభాష్‌ కాలనీలోని గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు.గాంధీజీ ఆశయాలను ప్రభుత్వాలు, ప్రజలు పాటించాలన్నారు.