హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైల్వే సాధన కోసం మౌన దీక్ష

SRPT: గాంధీ జయంతిని పురస్కరించుకుని అహింస, శాంతియుత పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యమవుతాయనే గాంధీజీ మార్గంలో సూర్యాపేట రైల్వే సాధన కమిటీ ఆధ్వర్యంలో మౌన నిరాహార దీక్ష చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు, సాధన కమిటీ సభ్యులు పాల్గొని రైల్వే లైన్ సాధనకై తమ నిరసన వ్యక్తం చేశారు.