హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్లగడ్డలో ప్రత్యేక ప్రజా గ్రీవెన్స్ డే

NDL: ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శుక్రవారం ప్రత్యేక ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.