హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ బరిలో అశోక్..!

KMM: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నిరుద్యోగ పోరాట నాయకుడు అశోక్ ప్రకటించారు. ప్రధాన పార్టీలు బీసీలను కాదని రెడ్డి సామాజికవర్గానికి టికెట్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. నిరుద్యోగుల కోసం పోరాడి 18 కేసులు ఎదుర్కొన్న తనకు, పట్టభద్రులంతా మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు.