RR: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు అందరికీ ఆదర్శమని మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ శ్వేతా పాండురంగారెడ్డి అన్నారు. కమిషనర్ యోగేష్, కౌన్సిలర్‌లు, కో ఆప్షన్ సభ్యులు, AMC ఛైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మున్సిపల్ కార్యాలయంలో గాంధీ జయంతి


