హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంజీరా రచయితల సంఘం మహాసభలో హరీష్ రావు

HYD: బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మంజీరా రచయితల సంఘం 40 ఏళ్ల మహాసభలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మరసం పోరాటాలు, తెలంగాణ ఉద్యమంలో సాహిత్య ప్రాధాన్యం, కవుల సేవలను కొనియాడారు. నేటి డిజిటల్ యుగంలో తగ్గిపోతున్న పుస్తక పఠనంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఏఐ ఎంత వేగంగా రాసినా గుండెలోంచి వచ్చే కవిత్వంలో ఉండే నిజాయితీ ఉండదన్నారు.