హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్‌లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

NRML: గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్‌లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఆధ్వర్యంలో మంజులాపూర్ చెరువు వద్ద చెత్తను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తబండికి ఇవ్వాలని, ఎక్కడపడితే అక్కడ వేయొద్దని తెలిపారు.