NZB: ధర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస, సత్యం, శాంతి మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, చక్రపాణి పాల్గొన్నారు.
తెలంగాణ
ధర్పల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


