హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి'

JGL: గాంధీజీ ఆశయాలను ఆచరించడమే గాంధీకి మనమిచ్చే నిజమైన నివాళి అని జగిత్యాల జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల పట్టణం 44వ వార్డులో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ అహింసా మార్గంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు.