VKB: మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధికారులు, సిబ్బంది కూడా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గాంధీజీ ఆశయాలను నెరవేర్చాలి: కలెక్టర్


