హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గమ్మ విగ్రహాల విక్రయాలతో సందడే సందడి

WGL: వరంగల్ భద్రకాళి ఆర్చీ సమీపంలో దుర్గామాత నవరాత్రుల సందడి ముందుగానే ప్రారంభమైంది. ఉత్సవాలకు మరో 9రోజులు ఉండటంతో వివిధ ఆకారాలు, పరిమాణాల్లో అమ్మవారి విగ్రహాలను వ్యాపారులు విక్రయానికి సిద్ధం చేశారు. శుక్రవారం విగ్రహాల కొనుగోలుకు భక్తులు తరలిరావడంతో ఆర్చీ పరిసరాలు సందడిగా మారాయి. పలు ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనకు మండపాల ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి.