హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా గాంధీ జయంతి, జల సమృద్ధి వేడుకలు

MDK: నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో సర్పంచ్ స్వప్న రమేష్ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతిని పురస్కరించుకుని జలజీవన్ మిషన్ జల మహోత్సవం నిర్వహించారు. వాటర్ ట్యాంక్‌ను అలంకరించి, నీటి సంరక్షణపై గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మిషన్ భగీరథ AE భిక్షపతి నీటి వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం వాటర్ మెన్, సిబ్బందిని ఘనంగా సన్మానించారు.