MNCL: లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఈరోజు చెన్నూరు(M) సుద్దాల గ్రామంలోని రైతులని BJYM జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ సన్మానించారు. శివకృష్ణ మాట్లాడుతూ.. లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు మరువలేనివని, జై జవాన్-జై కిసాన్ నినాదం ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన బాటలో మనం కూడా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: రైతులను సన్మానించిన కౌన్సిలర్ శివకృష్ణ


