హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే పాయంకు కాంట్రాక్టు టీచర్ల వినతి

BDK: మణుగూరులో గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మినిమం టైం స్కేల్ అమలు చేసి, 61 ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.