హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులు

GDWL: అలంపూర్ పట్టణంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శరత్ బాబు ఆధ్వర్యంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శరత్ బాబు మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులోనే మహాత్మా గాంధీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న మహోన్నతుడని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.