హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ జూనియర్ కబడ్డీకి వైష్ణవి ఎంపిక

NLG: మునుగోడు ఎంజేపీ గురుకుల బాలికల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని బి. వైష్ణవి సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. జిల్లాస్థాయిలో రణించి ఎంపికైన ఆమె, అక్టోబర్ 2 నుంచి 5 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్యారాణి, పీడీ నాగమణి, పీఈటీ శ్రీలత, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.