MDK: చేగుంట పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్‌లో తపస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర నాయకులు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో జవాన్, కిసాన్ పాత్ర అత్యంత కీలకమని, ఆయన జై జవాన్ - జై కిసాన్ నినాదం నిత్య స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేష్, కృష్ణమూర్తి, దేవానంద్ పాల్గొన్నారు.
తెలంగాణ
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు


