హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శానిటరీ వ్యర్థాలను ఎరుపు రంగు డబ్బాలో వేయాలి'

HYD: శానిటరీ ప్యాడ్‌లు, డైపర్లు, వెట్ వైప్స్, కాటన్ బడ్స్‌ను ఎరుపు రంగు డబ్బాలోనే వేయాలని సీఎంసీ X వేదికగా తెలిపింది. బాధ్యతాయుతంగా వ్యర్థాలను వేరు చేయడం వల్ల పారిశుద్ధ్య కార్మికులను కాపాడటంతో పాటు సైబరాబాద్‌ను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచవచ్చన్నారు. సరైన నిబంధనలు పాటిస్తూ పర్యావరణ పరిరక్షణలో మనందరం భాగస్వామ్యం కావాలన్నారు.