WGL: నర్సంపేటలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'గాంధీజీ ఆశయాలను ఆచరించాలి'


