KMR: మద్నూర్ మండలం అవల్‌గావ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్ మన్యాబాయి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణానికి సాంప్రదాయబద్ధంగా ముగ్గు పోసి పనులను శ్రీకారం చుట్టారు. ఉపసర్పంచ్ విజయ్, వార్డు సభ్యులు నరసమ్మ, బాలరాజు, కీసరి మారుతితో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.!


