హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర మంత్రుల భేటీ

WGL: ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. వరంగల్ మామునూరు విమానాశ్రయ పనుల పురోగతి, తదితర అంశాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సుదీర్ఘంగా చర్చించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.