KNR: సత్యం, అహింసలతో కోట్లాది భారతీయుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు గాంధీజీ అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. జాతిపిత ఆశయాలను, సిద్ధాంతాలను నేటితరం ఆదర్శంగా తీసుకుని ఆచరించాలన్నారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు.
తెలంగాణ
మహాత్ముని ఆశయాలు ఆదర్శనీయం: మేయర్


