హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీల అభివృద్ధికి పూర్తి సహకారం: భోగ శ్రావణి

JGL: చిన్నారులు, గర్భిణీలకు సేవలందేలా మా సహకారం ఉంటుందని బీజేపీ ఇన్‌ఛార్జ్ భోగ శ్రావణి అన్నారు. రాయికల్ మండలం ఇటిక్యాలలో శుక్రవారం ప్రధాని మోదీ దినోత్సవాల సందర్భంగా 'అంగన్ మిలన్ సేవ' జరిగింది. పోషకాహారం, వసతులపై దృష్టి సారిస్తామని ఆమె చెప్పారు. పిల్లలకు పండ్లు పంచి, సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, మహిళా మోర్చా నేతలు పాల్గొన్నారు.