హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దిల్‌సుఖ్‌నగర్‌లో హిందూ సంఘాల ఆందోళన

HYD: దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో ఓ వ్యక్తి కర్రతో అమ్మవారి విగ్రహంపై, పూజారిపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన భక్తులు అతడిని పట్టుకుని తాడుతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.