హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అహింసా మార్గంతో స్వాతంత్య్ర పోరాటానికి గాంధీజీ మార్గదర్శకం'

జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాంతి, అహింస, సత్యం మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎస్పీ సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ చేసిన పోరాటం గురించి కొనియాడారు.