KMR: భిక్కనూర్ మండలం భాగీర్తిపల్లి సబ్‌స్టేషన్‌ను శుక్రవారం గ్రామ రైతులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. విద్యుత్ కోతలు, విద్యుత్ సమస్యలను నిరసిస్తూ ఉదయం నుంచి సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. అయితే విద్యుత్ డీఈ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ ముట్టడి


