హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉదాసీన వైఖరికి నిరసనగా దశలవారీ ఉద్యమం: TUWJ

HYD: జర్నలిస్టుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని నిరసిస్తూ TUWJ ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈనెల 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులు పంపాలన్నారు.