హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు నిర్మించారు కానీ.. మురుగు కాలువ మరిచారు'

VKB: ధారూర్ మండల పరిధిలోని అల్లాపూర్‌లో సిమెంటు రోడ్డు నిర్మించి, మురుగు కాలువ నిర్మాణం కోసం స్థలం వదిలేశారు. రహదారి పనులు పూర్తయి 3 నెలలు గడుస్తున్నా అక్కడ కాలువ మాత్రం నిర్మించలేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పకైనా పట్టించుకుని పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.