MNCL: జైపూర్ మండలం కుందారంకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు నరసింహస్వామి అనారోగ్యంతో మృతి చెందాడు. సమాజహితం కాంక్షించి వైద్య విద్యా పరిశోధనకు కుటుంబీకులు మృతుడి శరీరాన్ని కరీంనగర్‌లోని మెడికల్ కాలేజీకి శుక్రవారం అందజేశారు. వైద్య విద్య పరిశోధనకై పార్థివ దేహాన్ని అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని పలువురు అభినందించారు.
తెలంగాణ
వైద్య పరిశోధనకు పార్థివదేహం అప్పగింత


