హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివశంకర్ రెడ్డి అకాల మరణం బాధాకరం: ఎంపీ డీకే అరుణ

NRPT: కోస్గి బీజేపీ నాయకులు ప్రతాప్ రెడ్డి సోదరుడి కుమారుడు నాగులపల్లి శివ శంకర్ రెడ్డి అకాల మరణం పట్ల మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోస్గిలోని వారి నివాసంలో శివ శంకర్ రెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.