హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా రాములవారి నిత్య కళ్యాణం

KMM: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిత్య కల్యాణ వేడుక శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపంలో అర్చకులు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.