హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆహ్వానం

VKB: జిల్లాలోని 27 పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నామని జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు పీఎంశ్రీ పాఠశాల ప్రాధానోపాధ్యాయుడిని సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.