JN: పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నరసింహులు 100వ జయంతి సందర్భంగా శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రజల కోసం పోరాడిన నల్లా నరసింహులు పేదలు, బడుగు వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన సేవలు, త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యత అని అన్నారు.
తెలంగాణ
నల్లా నరసింహులుకు నివాళులు


