PDPL: జాతిపిత మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని, నివాళులు అర్పించారు. నేటి యువత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. శాంతి, సహనం, అహింస సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. ఏవో బండి ప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'గాంధీజీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం'


