WGL: వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి శుక్రవారం గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ నేతావత్ శిభారాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
జాతిపితకు ఘన నివాళులు


