హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూగర్భ జలాలు పెరగాలంటే మొక్కలు రక్షించాలి'

BDK: ఇల్లందు పురపాలకం పరిధిలో 2వ వార్డులో పురపాలకం ఛైర్మన్ దొడ్డా కిరణ్ మిత్రడానెయల్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం మొక్కల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. భూగర్భ జలాలు పెరగాలంటే మనమంతా మొక్కలను రక్షించాలి, పెంచాలని అన్నారు. ప్రజల మొక్కలు పెంచడం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.