హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపుతప్పి కాలువలో పడిన బైక్.. వ్యక్తి మృతి

MLG : గంగాగూడెం సమీపంలో గురువారం రాత్రి బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్న కాలువలో పడడంతో వాజేడు మండలం పేరూరుకు చెందిన తుమ్మ రమేష్ (48) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.