హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీజీ ఆశయాలను ఆచరించాలి: నిర్మల్ ఎస్పీ

NRML: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, సహనం, ఐక్యత వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు సేవ చేయడం, వారి భద్రతకు భరోసా కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.