NGKL: కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన మనేమోని పుల్లయ్యను బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియమించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. పదవి దక్కడంపై పుల్లయ్య పార్టీ అధిష్ఠానం, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పుల్లయ్య


