హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాగజ్‌నగర్‌లో స్వచ్ఛ భారత్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని 29వ వార్డులో గాంధీ జయంతి సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.