హైదరాబాద్: 28°C
తెలంగాణ

​రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

MDK: గిడ్డంగుల సంస్థ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో కుక్కల సద్దాం హుస్సేన్ (40) దుర్మరణం చెందారు. కుక్కల మక్సూద్ కుమారుడైన సద్దాం హుస్సేన్ బైక్‌పై యూటర్న్ తీసుకుంటుండగా, రామాయంపేట వైపు నుంచి వస్తున్న బస్సు ప్రమాదకర రీతిలో ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.