హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్లలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. సామాజిక సమానత్వం, పరిశుభ్రత వంటి విలువలను గాంధీజీ సమాజానికి అందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.