హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీజీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి, ఐక్యత మార్గాలను చూపారని నాయిని అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని సూచించారు.
తెలంగాణ
గాంధీజీ చూపిన మార్గంలో నడవాలి: MLA నాయిని


